ఉప్పుగుండూరులో సీసీ కెమెరాలు ఏర్పాటు

శ్రీకాకుళం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గ్రామస్థుల సహకారంతో ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు గ్రామస్థులు కృషి చేయాలన్నారు.