ఇది ఇండియా కాదా?.. పోలీసులపై రాహుల్ ఫైర్

ఇది ఇండియా కాదా?.. పోలీసులపై రాహుల్ ఫైర్

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ సరిహద్దు గ్రామాన్ని సందర్శించడానికి అక్కడి పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారిపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇది ఇండియా కాదా?.. భారత భూభాగంపైనే భద్రత లేదని చెబుతున్నారా? అంటూ పోలీసులను ప్రశ్నించారు.