ఆరు దశాబ్దాల తర్వాత.. మళ్లీ 'జన'కళ!
భారత్-చైనా 1962 యుద్దం తర్వాత తొలిసారిగా ఉత్తరాఖండ్ జోహార్ లోయలోని మిలం గ్రామంలో జనకళ సంతరించుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఈ గ్రామంలో ఓ నూతన భవనం నిర్మితమైంది. ఆ గ్రామంలో ప్రజలు తిరిగి నివసించేలా రూ.20 కోట్ల వ్యయంతో వైబ్రంట్ విలేజ్ పేరిట ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ మేరకు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.