రూ.130 కోట్ల మెడికల్ హాస్టల్‌కు భూమిపూజ
గద్వాల జిల్లా దౌదరపల్లి సమీపంలో రూ.130 కోట్లతో మెడికల్ కాలేజీ వసతి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాలను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. స్థానికులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.