VIDEO: ‘వైసీపీ ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయండి'
SKLM: వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నరసన్నపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి ఈనెల 28వ తేదీన ప్రజా ఉద్యమం చేపడుతున్నామన్నారు.