అంగన్వాడీ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ ఛాన్స్

అంగన్వాడీ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ ఛాన్స్

అన్నమయ్య: కురబలకోట మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఆదివారం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని CDPO సుజాత తెలిపారు. దాదంవారిపల్లె SC, ముదివేడు SC, నందిరెడ్డిగారిపల్లె(HH)ల్లో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి పాసై, 21-35 ఏళ్ల లోపు వయస్సు కలిగి, స్థానికంగా నివాసం ఉన్న మహిళలు అర్హులని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను తంబళ్లపల్లె 5 గంటలలోపు సమర్పించాలన్నారు.