నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్

తూ.గో: అమలాపురం 29వ వార్డు విద్యుత్ నగర్‌లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా కలెక్టర్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.