జిల్లాలో నేడు 8,086 మందికి సామూహిక గృహప్రవేశాలు
సత్యసాయి: జిల్లా ఐదు నియోజకవర్గాల్లో నేడు ప్రభుత్వ ఆదేశాల మేరకు 8,086 మంది లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని గృహ నిర్మాణశాఖ అధికారి వెంకటనారాయణ తెలిపారు. పీఎంఏవై (యూ) 2.0 కింద మంజూరైన 2,357 ఇళ్లకు పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.