'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
ADB: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. APK ఫైల్స్, జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఈ-కామర్స్, కస్టమర్ కేర్, స్టాక్ మార్కెటింగ్ వంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ మోసపోతే జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్, 1930ను సంప్రదించాలన్నారు. ఈ వారం జిల్లాలో 14 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు SP పేర్కొన్నారు.