పోటీ చెయ్యి రాములమ్మా!.. కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి
MHBD: జిల్లాలో ఎన్నికల వేళ ఓ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దంతాలపల్లి (M) దాట్ల గ్రామంలో మాజీ MPTC సభ్యుడి తల్లి రాములమ్మను సర్పంచ్‌గా పోటీ చేయాలంటూ ఓ కాంగ్రెస్ అభిమాని వేడుకున్నాడు. గ్రామంలో ఈ స్థానం BC మహిళకు కేటాయించగా ఆమెను పోటీ చేయాలని అతను కోరాడు. కాగా, గ్రామంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది.