ఇసుక అక్రమ రవాణాపై స్థానికుల ఆగ్రహం
MHBD: నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి, పకీర తండా, జయపురం గ్రామ శివారు ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పట్టపగలే వందల ట్రిప్పులు ఇసుక అక్రమంగా తరలివెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులు ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.