ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తా: ఎంపీ

పల్నాడు: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. వినుకొండ పట్టణంలో జరిగిన ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఏఏ, ఎన్ఆర్సీ 4% రిజర్వేషన్ కల్పించే విషయంలో టీడీపీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎంపీ నిధులతో పార్లమెంట్ వ్యాప్తంగా 50షాదీ ఖానాలు నిర్మిస్తామని తెలిపారు.