ఉద్యోగులు ఆరోగ్యం పై అప్రమత్తత అవసరం: జేసీ
కోనసీమ: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి బీపీ, షుగర్ వంటి వ్యాధులపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన ఆహారపు అలవాట్లతో వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.