అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడులో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. క్యాంటీన్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.