మున్సిపల్ కమిషనర్‌గా రమ్య కీర్తన బాధ్యతలు
పల్నాడు: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బి. రమ్య కీర్తన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమెకు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.