'రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి'
NZB: రుద్రూర్ మండల కేంద్రంలో అకాల వర్షాలకు నీట మునిగిన పంటలను CPM నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ మాట్లాడుతూ.. రైతులు అప్పు తెచ్చి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట నెలకొరిగిందని, నష్టపోయిన రైతులకు రూ. 30,000 పరిహారం అందించాలి అని ఆమె కోరారు. ఇందులో ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, శంకర్ గౌడ్, విగ్నేష్ మండల కమిటీ సభ్యులు ఉన్నారు.