VIDEO: డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించి జీఎస్టీలో కలపాలి: CITU
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో బుధవారం CITU అధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. జీవో నంబర్-21ని రద్దు చేయాలని, ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 30,000 ఇవ్వాలన్నారు. పెంచిన చలానా ఛార్జీలను తగ్గించి, డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించి జీఎస్టీలో కలపాలన్నారు.