నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి

KMM: బూర్గంపాడు మండలంలో అఖిలభారత రైతుకూలీ సంఘం నేడు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు అమ్మకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులకు నష్టం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట రైతులు నకిలీ విత్తనాల బారినబడి ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.