ఫేక్ న్యూస్ అలర్ట్: చలాన్ల మాఫీపై ప్రచారాన్ని నమ్మవద్దు
RR: డిసెంబర్ 13వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, ఆ రోజున పెండింగ్ చలాన్లను క్లియర్ చేస్తే భారీగా డిస్కౌంట్ ఇస్తారని ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఇది కేవలం పుకారు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు లేదా ఆకతాయిలు సృష్టించే ఇటువంటి ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.