ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
WGL: క్రీడారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో గల ఇండోర్ స్టేడియాన్ని ఆయన సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడి, వారితో కలిసి కొంతసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఇండోర్ స్టేడియంలో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.