మహానాడు సభ కోసం స్థలాల పరిశీలన
AP: మహానాడు నిర్వహించే స్థలాలను పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ పరిశీలించనుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యటించనున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో 4 ప్రదేశాలు ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పరిధిలోనూ ఒక స్థలం సెలక్ట్ చేశారు. స్థల పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.