తాహసీల్దార్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
SKLM: మెలియాపుట్టి తాహసీల్దార్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతుల తన చిత్రపటానికి తాహసీల్దార్ బీ. రామారావు పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ పేరుతో సార్ధకం చేసుకున్న ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు ఉన్నారు.