VIDEO: సోలార్ ఎనర్జీ పరిశ్రమలో చోరీ
MDK: నార్సింగి మండలం వల్లభాపూర్ గ్రామ శివారులోని సోలార్ ఎనర్జీ పరిశ్రమలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి పరిశ్రమలోకి చొరబడిన ఇద్దరు దొంగలు 5లైట్ ఎరస్టార్ పరికరాలు, కేబుల్ వైరు చోరీకి పాల్పడ్డట్టు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.