గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి

HNK: హన్మకొండలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు విద్యార్థి సంఘ నేతలు అజ్మీరా వెంకట్ నాయక్, భానోత్ భాస్కర్ నాయక్ వినతి పత్రం అందజేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం, దోమతెరలు, దుప్పట్లు కల్పించాలని కోరారు. అలాగే ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖలో అవినీతిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.