రెండో విడత పోలింగ్ ప్రారంభం
SRCL: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల పరిధిలోని 77 గ్రామ పంచాయతీలు, 958 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.