'పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

KMR: ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రాంగణంలో గురువారం రాత్రి తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు సన్మానం చేశారు. ఉపాధ్యాయ, పట్టా భద్రుల కోసం మండలిలో ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు.