అవుకు రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రి బీసీ
NDL: అవుకు మండలంలో ఆదివారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించారు. చెరువు ఆనకట్ట దెబ్బతిన్న చోటును త్వరగా మరమ్మతులు చేపట్టాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెరువు ఆనకట్ట పనులను పూర్తి చేస్తారన్నారు.