'నా భర్త ఐదుగురిని హతమార్చాడు'

GNTR: క్రోసూరు(M) ఎర్రబాలెంలో మంగ్యనాయక్(19)ను తండ్రే హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగ్యనాయక్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్తికోసం రెండో భార్యతో కలిసి నా మూడేళ్ల చిన్న కొడుకు, ఆడపడుచు, అత్త, మామను హతమార్చాడు. ఇప్పుడు నా పెద్ద కొడుకును చంపాడు అని ఆమె తెలిపింది.