మధిర 18వ వార్డులో కోన ధనికుమార్ విజయం
KMM: మధిర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోన ధనికుమార్ 236 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప సీపీఎం అభ్యర్థి పంతంగి నాగయ్యపై స్పష్టమైన మెజారిటీతో కనబరిచారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ మార్క్ మధిరలో స్పష్టంగా కనిపిస్తుంది.