భూ సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

భూ సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

CTR: చౌడేపల్లె మండలంలోని నుని ముద్దలపల్లి గ్రామానికి చెందిన కోటమ్మ సుబ్రమణ్యం భూ సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో కమ్యూనిటీ భవనం, అంగన్వాడి సెంటర్ నిర్మించాలని కోరారు. దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసిల్దార్‌ను ఆదేశించారు