బాధిత మహిళను పరామర్శించిన జనసేన కో-ఆర్డినేటర్

E.G: కోరుకొండ మండలం బొల్లెద్దులపాలెం గ్రామానికి చెందిన పుప్పల వెంకటగిరి భార్య రమణ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న జనసేనపార్టీ 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మీ స్పందించారు. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం కలిసి, ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.