హార్వర్డ్ మాజీ ఉద్యోగి అరెస్ట్

హార్వర్డ్ మాజీ ఉద్యోగి అరెస్ట్

హార్వర్డ్ వర్సిటీకి చెందిన మాజీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ వైద్య విభాగానికి దానంగా ఇచ్చిన మృతదేహాల నుంచి శరీర భాగాలను మాయం చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. మార్చురీ నుంచి శరీర భాగాలను వేరు చేసి వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఓ మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.