వృద్ధురాలిని కాలువలో తోసేసి బంగారం అపహరణ
నెల్లూరు: కోవూరు పడుగుపాడు జమ్మిపాలెం వెళ్లే రహదారి నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద ఉన్న కాలువలో రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు కాలువ నుంచి బయటకు తీశారు. కావలిలో ఉన్న కొడుకు ఇంటికి బయలుదేరిన వృద్ధురాలిని అక్క కొడుకు సతీష్ బస్సు ఎక్కిస్తానని నమ్మించి రాత్రి 8 గంటల సమయంలో కాలువలో దోసేసి తన వద్ద ఉన్న 4 సవర్ల బంగారం ఎత్తుకెళ్లాడని తెలిపింది.