నేను BRSను వీడను: జీవన్ రెడ్డి
TG: తాను BRSను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఏ కేంద్ర మంత్రినీ కలవలేదని, HYDలోనే ఉన్నానని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని, ఇలాంటి ఫేక్ వార్తలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.