VIDEO: భవానీ భక్తుల పయనం ప్రారంభం
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన భవానీ భక్తులు గురువారం అల్లినగరం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కాలినడకన పయనమయ్యారు. ఈ సందర్భంగా భవాని గురువు కూనపు నాగరాజు మాట్లాడుతూ.. హిందూ మత వ్యాప్తి నిమిత్తం కాలినడకన జై దుర్గ జై భవాని అంటూ నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టామని తెలిపారు.