విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: ASI

ASF: వేధింపులకు గురయ్యే విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఇంఛార్జి ASI సునీత పిలుపునిచ్చారు. బుధవారం కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళల రక్షణ ప్రత్యేక చట్టాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.