పోలీస్ అమరవీరుల కోసం కొవ్వత్తు ర్యాలీ
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ వరకు గురువారం ఎస్ఐ అఖిల్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల కోసం కొవ్వత్తు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ అఖిల్ మాట్లాడుతూ.. ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు అండగా ఉంటారని, అమరులైన పోలీసులకు జోహార్ అని పేర్కొన్నారు.