'కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి'

GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్పీ శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల ధరూర్‌లో జరిగిన భూభారతి అవగాహన కార్యక్రమంలో వచ్చిన వివాదం మంత్రి సమక్షంలో పరిష్కారం అయినప్పటికీ, కొందరూ కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తుంటారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసాక్ తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.