'తల్లితండ్రుల కలలు సాకారం చేయాల్సిన బాధ్యత మీదే'
NZB: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మార్చుకోవాలని టీయూ వీసీ యాదగిరి రావు అన్నారు. 2025-26 విద్యా సం.రానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు బుధవారం ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. తల్లితండ్రులుమీపై పెట్టుకున్న కలల్ని సాకారం చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు.