నేటి నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు

సంగారెడ్డి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవి, ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నేటి నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పెంపొందించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమన్నారు. డీఎస్ఈ, ఎఫ్ఆర్ఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ముఖ గుర్తింపు హాజరు వేసుకోవాలని సూచించారు.