ఇంటికి తాళం వేసిన అధికారులు
విశాఖలోని 51వ వార్డులో ఆస్తి పన్ను బకాయిలపై జివిఎంసి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శేఖర్ నేతృత్వంలో నార్త్ జోన్ సిబ్బంది శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి దీర్ఘకాలంగా పన్ను చెల్లించని ఇంటికి తాళం వేశారు. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు.