VIDEO: జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు
KKD: కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. గురువారం సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా కల్తీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి లేబరేటరీకి పంపిస్తున్నామన్నారు.