అమలాపురంలో రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణ సీఐ వీరబాబు మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అనవసర గొడవలకు, ఘర్షణలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లను ఆయన గట్టిగా హెచ్చరించారు.