విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది
W.G: పోడూరు మండలం పైడావ నెం. 2 స్కూల్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది మంగళవారం విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ యం కొల్లాబత్తుల సూర్య కుమార్, ANM పమ్మి దివ్య, ఆశా వర్కర్ పి. వెంకట లక్ష్మి, కె. జయ పాల్గొన్నారు.