నర్సంపేట ప్రభుత్వ కళాశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్

నర్సంపేట ప్రభుత్వ కళాశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్

వరంగల్: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సహకారంతో రోబోటిక్స్‌పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ.. భారతదేశంలో రోబోటిక్స్ ప్రాథమిక దశలో ఉందని, విద్యార్థులు దీనిని నేర్చుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.