VIDEO: ముప్పిరెడ్డిపల్లిలో కార్డెన్ సెర్చ్
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నుంచి తూప్రాన్ డీఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతంగా వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండడంతో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను విచారణ చేస్తున్నారు.