ఘనంగా సోమలమ్మ వార్షికోత్సవ వేడుకలు
కోనసీమ: ఉప్పలగుప్తం మండలంలోని చినగాడవిల్లి గ్రామంలో ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను స్థానిక భక్తులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కొమ్మాళ్ళపల్లి కాశీ విశ్వనాథం సారధ్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. 108 కలశములతో తీసుకువచ్చిన సప్త నది జలాలతో, పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. కుంకుమ పూజలు చేశారు.