మంగ్లీ అడ్వకేట్ వర్షన్ ఇదే...!
HYD: మంగ్లీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆమె తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. మంగ్లీ పేద కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డని, ఆమె ఎదుగుదలను చూడలేక కొంతమంది కావాలని దుష్పచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కూడా కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని న్యాయవాది మండిపడ్డారు. మంగ్లీపై న్యాయవాది సుబ్బు చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన తీవ్రంగా ఖండించారు.