ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి: కలెక్టర్

కామారెడ్డిలోని యోగాభవన్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు యోగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ముఖ్యమని, నిద్రలేమికి, ఒత్తిడి తగ్గడానికి, ఏకాగ్రతకు కేంద్రబిందువని అన్నారు. DM&HO డా.రవీందర్ గౌడ్, GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు ఉన్నారు.