'నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: మంత్రాలయం మండలం తుంగభద్ర నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MRO రమాదేవి బుధవారం సూచించారు. ఎగువన హోస్పేట్ డ్యాంలో గరిష్ఠ నీటిమట్టం ఉండటంతో కిందికి నీటిని వదిలారన్నారు. కాబట్టి నది సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.